క్రీడలతో స్నేహభావం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో స్నేహభావం

Jun 5 2026 10:15 AM | Updated on Jun 5 2026 10:15 AM

క్రీడలతో స్నేహభావం రెస్టారెంట్‌లో కుళ్లిన మాంసం దరఖాస్తుల ఆహ్వానం రాష్ట్రపతి సమావేశంలో విఠల్‌ రాథోడ్‌ పుస్తకాలొచ్చాయ్‌..

స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌

అనంతగిరి: క్రీడలతో శారీరక దృఢత్వం తోపాటు స్నేహభావం పెరుగుతుందని స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అన్నారు. గురువారం వికారాబాద్‌లోని బ్లాక్‌ గ్రౌండ్‌లో వీడీఎఫ్‌ఏ ఆధ్వర్యంలో ఫుట్‌బాల్‌ పోటీలు నిర్వహించారు. విజేత జట్లకు బహమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటమలు సహజమన్నారు. ఓటమి గెలుపుకు నాంది అన్నారు. కార్యక్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ నేషనల్‌ జనరల్‌ సెక్రటరీ సంతోష్‌కుమార్‌, పట్టణ పార్టీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, కౌన్సిలర్‌ చిగుళ్లపల్లి రమేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

నోటీసులు జారీ చేసిన

మున్సిపల్‌ అధికారులు

తాండూరు టౌన్‌: పట్టణ పరిధిలోని గౌతాపూర్‌ మార్గంలో గల శ్రీ దుర్గా బార్‌ అండ్‌ రెస్టారెంట్‌పై గురువారం మున్సిపల్‌ అధికారులు దాడి చేశారు. కిచెన్‌లో కుళ్లిన మాంసం, మిగిలిపోయిన, పాడైపోయిన తిను పదార్థాలను ఫ్రిడ్జిల్లో నిల్వ చేసి కస్టమర్లకు అందిస్తున్నట్లు తేలింది. వాటిరి స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సదరు రెస్టారెంట్‌ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. తనిఖీల్లో మున్సిపల్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రాములు, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌ ప్రవీణ్‌ కుమార్‌, శానిటరీ జవాన్లు తదితరులు పాల్గొన్నారు.

పూడూరు: మండలంలోని ఎన్కేపల్లి మోడల్‌ స్కూల్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఎంఈఓ సాయిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అసిస్టెంట్‌ కుక్‌ మహిళ(1), నైట్‌ వాచ్‌మెన్‌ (1) పోస్టులను కంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 7వ తరగతి పాసై ఉండాలని, ఆసక్తి గల వారు ఈ నెల 8 వ తేదీ ఉదయం 10 గంటలకు మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాన్‌ను సంప్రదించాలని కోరారు. మండలానికి చెందిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.

తాండూరు టౌన్‌: గిరిజన స్కాలర్‌షిప్‌ పథకాల లబ్ధిదారులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో బషీరాబాద్‌ గిరిపుత్రుడు పీహెచ్‌డీ పట్టభద్రుడు, టీజీటీ గురుకుల ఉపాధ్యాయుడు డాక్టర్‌ విఠల్‌ రాథోడ్‌ పాల్గొన్నారు. గురువారం జన జాతీయ గరిమా ఉత్సవ్‌ వేడుకల్లో భాగంగా గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విఠల్‌ రాథోడ్‌ మాట్లాడుతూ.. బిర్సా లైవ్స్‌ ఇన్‌ న్యూభారత్‌ వీక్‌ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో గిరిజన నాయకుడు బిర్సాముండా వారసత్వాన్ని స్మరించుకోవడంతో పాటు, గిరిజన వర్గాల యువతకు రాష్ట్రపతి తమ ప్రసంగం ద్వారా స్ఫూర్తినిచ్చారన్నారు. విద్య, నాయకత్వం, సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహిస్తూనే, గిరిజన వర్గాల సాంస్కృతిక వారసత్వం, అందించిన సేవలను గుర్తుంచుకొంటుందని కొనియాడారు.

మొయినాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు ఈసారి ముందుగానే వచ్చాయి. పాఠశాలలు పునఃప్రారంభం కాకముందే స్కూళ్లకు చేరుతున్నాయి. మండలంలోని సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకోసం ఇప్పటికే మండల వనరుల కేంద్రానికి చేరాయి. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకోసం మొత్తం 21,497 పాఠ్యపుస్తకాలు, 31,165 నోట్‌ పుస్తకాలు వచ్చి నట్టు ఎంఈఓ మల్లయ్య తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement