ధాన్యాన్ని వెంటనే తరలించండి | - | Sakshi
Sakshi News home page

ధాన్యాన్ని వెంటనే తరలించండి

Jun 5 2026 10:15 AM | Updated on Jun 5 2026 10:15 AM

రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి

కలెక్టర్‌ దీపక్‌ తివారి

కొడంగల్‌: కొనుగోలు కేంద్రాల నుంచి వరి ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి ఆదేశించారు. గురువారం కొడంగల్‌లోని వ్యవసాయ మార్కెట్‌ గోదాం, వెంకటేశ్వర రైస్‌ మిల్లును సందర్శించారు. అక్కడి నిల్వలను పరిశీలించారు. లక్ష్యం మేరకు ధాన్యాన్ని తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. మిల్లుల వద్ద హమాలీల సంఖ్యను పెంచుకోవాలన్నారు. అదనపు లారీలను సమకూర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటాచారి, పౌరసంబంధాల అధికారి సుదర్శన్‌, జిల్లా మేనేజర్‌ మోహన కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇబ్బంది కలగొద్దు

దుద్యాల్‌: ధాన్యం కొనుగోలు, తరలింపులో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి ఆదేశించారు. గురువారం మండలంలోని హస్నాబాద్‌లో కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌ వెంకటాచారి, డీసీఓ శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ నవీన్‌ కుమార్‌, హస్నాబాద్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌, సిబ్బంది అక్బర్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

అధైర్య పడొద్దు

దుద్యాల్‌: కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యం మొత్తాన్ని సేకరిస్తామని, రైతులు అధైర్య పడరాదని జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారి శ్రీనివాస్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ అజ్మత్‌ అలి, కేంద్రం నిర్వాహకులు ఖలీల్‌ పాషా, శ్రీకాంత్‌, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement