దుద్యాల్: గ్రామీణ స్థాయిలో పార్టీ బలోపేతం ముఖ్యమని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆవుటి శేఖర్ పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని సంగాయిపల్లి గ్రామంలో గ్రామ సమన్వయ కమిటీ ఏర్పాటు కోసం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడానికి ప్రత్యేక ప్రణాళికలో భాగంగా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సంగాయిపల్లిలో కమిటీ సభ్యులుగా జైపాల్ రెడ్డి, రాజు, సంగాయిపల్లి తండాలో హన్మంతునాయక్, సంతోష్ కుమార్‌లను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్‌రెడ్డి, ఉప సర్పంచ్ జగదీశ్ నాయక్, నాయకులు కృష్ణ, సీతారం నాయక్, వెంకటయ్య, రాములు, వార్డు సభ్యుల, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


