వీఓఏల సమ్మె విరమణ | - | Sakshi
Sakshi News home page

వీఓఏల సమ్మె విరమణ

Jun 4 2026 7:21 AM | Updated on Jun 4 2026 7:21 AM

అనంతగిరి: వీఓఏల సమ్మెను విరమించినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు సుజాత, ప్రధాన కార్యదర్శి పుల్లయ్య తెలిపారు. బుధవారం డీఆర్‌డీఏ అడిషనల్‌ పీడీ నర్సింలును మర్యాదపూర్వకంగా కలిశారు. సమ్మె విరమిస్తున్నట్లు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు గోవర్ధన్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

తాత్కాలిక విరమణ

ధారూరు: ప్రభుత్వ హామీతో తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నట్ల వీఓఏల సంఘం జిల్లా అధ్యక్షురాలు సుజాత తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. పనిభారం తగ్గింపు, ఉద్యోగ భద్రత, గౌరవ వేతనం పెంపు తదితర డిమాండ్లతో సమ్మె చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం సాకూలంగా ఉండటంతో సమ్మెను తాత్కాలింకగా విరమిస్తున్నట్లు చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం కొంత కాలం వేచిచూస్తామని అన్నారు. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోకుంటే తిరిగి సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం మహిళా సంఘం మండల అధ్యక్షురాలు బాలేశ్వరికి వినతిపత్రం అందజేశారు.

కార్యకర్తలకు

అండగా ఉంటాం

మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి

కుల్కచర్ల: బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు, వారి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. చౌడాపూర్‌ మండల కేంద్రానికి చెందిన చెన్నమోని పెంటయ్య తల్లి చెన్నమ్మ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆయన బుధవారం బాధితుల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాందాస్‌ నాయక్‌, చౌడాపూర్‌ మండల అధ్యక్షుడు సుధాకర్‌ రెడ్డి, నాయకులు దాసు, పాల నర్సింలు పాల్గొన్నారు.

డీఈఓను కలిసిన

తపస్‌ నాయకులు

అనంతగిరి: డీఈఓగా బాధ్యతలు చేపట్టిన అబ్దుల్‌ ఘనీని బుధవారం తపస్‌ జిల్లా ప్రతినిధులు మర్యాపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సంగమేశ్వర్‌, రాష్ట్ర కార్యదర్శి అంజిరెడ్డి, రమేష్‌, జిల్లా బాధ్యులు ప్రసాద్‌కుమార్‌, బస్వరాజు, కృష్ణారెడ్డి, సంతోష్‌, మైపాల్‌రెడ్డి, సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

తాండూరు మున్సిపల్‌ కమిషనర్‌గా రాకేష్‌రెడ్డి

తాండూరు: తాండూరు మున్సిపల్‌ కమిషనర్‌గా పాల్వాయి రాకేష్‌రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న మధుసూదన్‌రెడ్డి రెండు రోజుల క్రితం జీహెచ్‌ఎంసీకి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రాకేష్‌రెడ్డి ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాకేష్‌రెడ్డి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నీరజా బాల్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాండూరును ఆరదర్శ మున్సిపాలిటీగా మార్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement