పరిగి: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణం కేంద్రంలోని ఆయన నివాసంలో మున్సిపల్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందన్నారు. కార్యకర్తలు సమష్టిగా పథకాలను, అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించాలన్నారు. ప్రతీ కార్యకర్తకు ప్రభుత్వం అండగా ఉండడంతో
రూ.50 వేల కోట్లతో అభివృద్ధి
పరిగి నియోజకవర్గాన్ని సుమారు రూ.50 వేల కోట్ల నిథులతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. పరిగి–షాద్‌నగర్, వికారాబాద్–పరిగికి నాలుగు లేన్ల రహదారి, పరిగిలో ప్రభుత్వ ఆస్పత్రి ఆధునీకరణతో పాటు వివిధ రకాల అభివృద్ధి పనులను రూ.27 కోట్లతో చేపడుతున్నామని వెల్లడించారు. అప్పా–మన్నెగూడ రహదారి, నేవీ రాడర్ ప్రాజెక్టు, రైల్వే లైనన్, ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేపీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు వంటి కీలకమైన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు.
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి


