గిరిజన చిన్నారి.. కూచిపూడిలో ఆరితేరి | - | Sakshi
Sakshi News home page

గిరిజన చిన్నారి.. కూచిపూడిలో ఆరితేరి

Jun 3 2026 6:42 AM | Updated on Jun 3 2026 6:42 AM

బొంరాస్‌పేట: మండల పరిధిలోని సూర్యానాయక్‌తండాకు చెందిన ననావత్‌ ఉమ, శ్రీనివాస్‌ దంపతుల కూతురు సిద్ధాంతి రెండేళ్లుగా కూచిపూడి నృత్యంతో ప్రశంసలు అందుకుంటోంది. హైదర్‌గౌడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నాలుగో తరగతి పూర్తి చేసిన బాలిక రెండు నెలల క్రితం రవీంద్రభారతిలో నృత్య ప్రదర్శన చేసింది. ఇటీవల చిక్కడపల్లిలోని త్యాగరాజ గానసభలో చేసిన నృత్యానికి గాను టాలెంట్‌ అచీవ్‌ అవార్డు అందుకుంది. త్వరలో యూపీలో నిర్వహించనున్న జాతీయ స్థాయి ప్రదర్శనలో సిద్ధాంతి పాల్గొననున్నట్లు ఆమె తల్లిదండ్రులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement