ఉత్తమ సేవలకు ప్రశంస | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ సేవలకు ప్రశంస

Jun 3 2026 6:42 AM | Updated on Jun 3 2026 6:42 AM

తాండూరు రూరల్‌: తాండూరు మండలంలోని జినుగుర్తి గేటు వద్ద ఉన్న తెలంగాణ మాడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ శ్రీదేవికి ప్రశంసా పత్రం అందజేశారు. వేసవి సెలవుల్లో పాఠశాల విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. కొన్ని వీడియోలను పర్యావరణ శాఖ వెబ్‌సైట్లో పొందుపరిచారు. దీంతో పర్యావరణ శాఖ అధికారులు పాఠశాలకు ప్రశంసలు అందజేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, అడిషనల్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌ చేతులమీదగా ప్రిన్సిపాల్‌ ప్రశంసాపత్రం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎకో క్లబ్‌ నిర్వాహకులు నిశాంత్‌ తదితరులున్నారు.

ఉత్తమ ఉద్యోగులకు..

కుల్కచర్ల: తెలంగాణ ఆవిర్భావాన్ని పురస్కరించుకుని ఉత్తమ విధులు నిర్వహించిన ఉద్యోగులకు జిల్లా అధికారులు ప్రశంసా పత్రాలను అందజేశారు. కుల్కచర్ల మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈఓగా విధులు నిర్వహిస్తున్న బక్కారెడ్డికి ఉత్తమఉద్యోగిగా పురస్కారం అందించారు. గిరిజన సంక్షేమ శాఖలో టీచింగ్‌ విభాగంలో కుల్కచర్ల గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న రాజేందర్‌ నాయక్‌ ఉత్తమ ఉద్యోగిగా ఎంపికయా్యారు. స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, కలెక్టర్‌ దీపక్‌ తివారి చేతుల మీదుగా వారు పురస్కారం అందుకున్నారు.

ఉత్తమ జూనియర్‌ అసిస్టెంట్‌గా శ్రీశైలం

ఉత్తమ ఉద్యోగిగా రాజేందర్‌ నాయక్‌

అనంతగిరి: ఉపాధ్యాయుడు నటరాజు

ఎస్టీ వెల్ఫేర్‌ కార్యాలయసబార్డినేట్‌ బాలకృష్ణ

Advertisement
 
Advertisement
Advertisement