ఎస్పీ స్నేహమెహ్ర
ధారూరు: పోలీస్‌స్టేషన్లలో 5–ఎస్ నిర్వహణను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా ఎస్పీ స్నేహమెహ్ర సూచించారు. సోమవారం ఆమె ధారూరు ఠాణాను సందర్శించారు. పీఎస్ కార్యాలయ నిర్వహణ, స్టేషన్ ఆవరణలో పరిశుభ్రత, రికార్డుల భద్రత, సిబ్బంది నిర్వాహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పత్రీ ఫిర్యాదు కేసు వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ప్రజలకు పోలీసు సేవల్లో అంతరాయం ఏర్పడకుండా చూసేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని, డయల్ 100, ట్యాబ్‌ల పనితీరు, సీసీటీఎన్‌ఎస్ నమోదు విధానం, డేటా అప్‌డేషన్ ప్రక్రియలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఎస్‌ఐలు రాఘవేందర్, గోపాల్‌ను ఆదేశించారు. ఆమె వెంట డీఎస్‌పీ అంజయ్య ఉన్నారు.


