తాండూరు రూరల్: కాంగ్రెస్‌తోనే పేదల సొంతింటి కల సాకారమవుతోందని చెన్‌గేస్‌పూర్ సర్పంచ్ ప్రవీణ్‌కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం గ్రామంలో ఎంపీడీఓ విశ్వ ప్రసాద్‌తో కలిసి లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్లును ప్రారంభించి మాట్లాడారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి చొరవతో గ్రామానికి 144 ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇప్పటి వరకు 23 ఇళ్లు పూర్తికాగ.. 58 ఇళ్లు ప్రోగ్రెస్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. రెండో విడతలో మరిన్ని ఇళ్లు మంజూరు కానున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్, హౌసింగ్ ఏఈ గణేశ్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు శ్రీశైలం గౌడ్, పంచాయతీ కార్యదర్శి వీరప్ప, వార్డు సభ్యులు గుండప్ప, నాయకులు నరేష్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.


