చూపు సమస్య ఉంటే పరీక్ష చేయించుకోండి | - | Sakshi
Sakshi News home page

చూపు సమస్య ఉంటే పరీక్ష చేయించుకోండి

May 31 2026 11:58 AM | Updated on May 31 2026 11:58 AM

అనంతగిరి: కంటి చూపు సమస్య ఉన్నవారు పరీక్ష చేయించుకోవాలని కలెక్టర్‌ దీపక్‌ తివారీ అన్నారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో హైదరాబాద్‌శంకర కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన శిబిరాన్ని పరిశీలించారు. వైద్య సిబ్బందితో మాట్లాడి శిబిరం నిర్వహణ, రోగులకు అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. అనంతరం నేత్రం పరీక్ష చేయించుకున్నారు. మధుమేహంతదితర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు నేత్ర పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటాచారి, వైద్య ఆరోగ్య శాఖ అధికారి పవిత్ర, ఏఓ పర్హినా బేగం, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement