ఇళ్ల బాధితులకు ప్లాట్ల కేటాయింపు | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల బాధితులకు ప్లాట్ల కేటాయింపు

Apr 10 2026 10:45 AM | Updated on Apr 10 2026 10:45 AM

ఇళ్ల బాధితులకు ప్లాట్ల కేటాయింపు

కొడంగల్‌: పట్టణంలోని మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఇళ్లు కోల్పోనున్న 39 కుటుంబాలకు చెందిన 61 మందికి గురువారం ఇంటి స్థలాలు కేటాయించారు. పట్టణ శివారులోని జాతర స్థలంలో ఆలయ ధర్మకర్తలకు చెందిన భూమిలో ప్లాట్లు ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అనుమతులతో పాటు వసతులు కల్పించారు. లక్కీ డ్రా ద్వారా కేటాయించారు. ఇంటి స్థలంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవతో ఆర్థిక సాయం అందిస్తామని మున్సిపల్‌ చైర్మన్‌ నందారం ప్రశాంత్‌ తెలిపారు. ఈ నెల 25వ తేదీ లోపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలయ నిర్మాణ భూమిపూజ కోసం కొడంగల్‌కు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆలయ నిర్మాణంలో ప్రజలందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ రాజేశ్వరి, తహసీల్దార్‌ రాంబాబు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ శంకర్‌ నాయక్‌, కమిషనర్‌ బలరాం నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement