ప్రశ్నించే యువతే దేశ భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రశ్నించే యువతే దేశ భవిష్యత్‌

Apr 9 2026 9:29 AM | Updated on Apr 9 2026 9:29 AM

తుర్కయంజాల్‌: ప్రశ్నించే యువతే దేశ భవిష్యత్‌.. యువజన సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర అన్నారు. ఆదిబట్ల సర్కిల్‌ పరిధి కమ్మగూడలోని జేబీ క్రికెట్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బీపీఎల్‌ టోర్నమెంట్‌ను బుధవారం ఆయన సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఓరుగంటి యాదయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న అవినీతి, అన్యాయం, నిరుద్యోగం, విద్యా వ్యాపారీకరణ, మాదక ద్రవ్యాల వ్యాప్తి వంటి సమస్యలపై ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. యువత పెడదోవ పట్టకుండా బాధ్యతతో మెలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నెర్లకంటి శ్రీకాంత్‌, జిల్లా కార్యదర్శి పి.శివ కుమార్‌ గౌడ్‌, నాయకులు కాటం రాజు గౌడ్‌, గణేశ్‌, అజయ్‌, మధూకర్‌, భరత్‌, శివ తదితరులు పాల్గొన్నారు.

ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement