భారీగా రేషన్‌ బియ్యం స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

భారీగా రేషన్‌ బియ్యం స్వాధీనం

Apr 9 2026 9:29 AM | Updated on Apr 9 2026 9:29 AM

523 క్వింటాళ్ల పీడీఎస్‌ రైస్‌, 69 క్వింటాళ్ల గోధుమలు సీజ్‌

పహాడీషరీఫ్‌: స్థానిక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నల్లబజార్‌కు తరలించేందుకు నిల్వ ఉంచిన 523 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం, 69 క్వింటాళ్ల గోధుమలను పౌర సరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ గోదాంలో పెద్ద ఎత్తున రేషన్‌ బియ్యం నిల్వ ఉంచిన విషయమై విశ్వసనీయ సమాచారం అందుకున్న జిల్లా సివిల్‌ సప్‌లై అధికారి వనజాత, రాజేంద్రనగర్‌ ఏఎస్‌వో పుల్లయ్య, ఇన్‌స్పెక్టర్‌ మహేష్‌ల బృందం బాలాపూర్‌ పోలీసులతో కలిసి బుధవారం దాడులు చేసింది. ఈ సందర్భంగా 523 క్వింటాళ్ల బియ్యం, 69 క్వింటాళ్ల గోధుమలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement