లేబర్ డిపార్ట్‌మెంట్ శంషాబాద్ డివిజన్ ఏఎల్‌ఓ వాల్యానాయక్
మొయినాబాద్‌రూరల్: కార్మికులకు సంక్షేమ పథకాలు అందేందుకు కృషి చేస్తానని లేబర్ డిపార్ట్‌మెంట్ శంషాబాద్ డివిజన్ ఏఎల్‌ఓ బి.వాల్యానాయక్ అన్నారు. బుధవారం కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ లేబర్‌సెల్ ప్రధాన కార్యదర్శి తోల్‌కట్ట శివశంకర్‌గౌడ్, లేబర్ సెల్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు జ్యోతితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శివశంకర్ గౌడ్ మాట్లాడుతూ.. భవన, నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమానికి 1996లో చట్టం పరిధిలోని లబ్ధిదారులకు సంక్షేమ మండలి నుంచి లబ్ధి చేకూరేలా చూడాలని కోరారు. శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి రూ.5లక్షలు, పాక్షిక అంగవైక్యల్యం కలిగిన వారికి రూ.4లక్షలు ఆర్థికసాయం అందేలా చూడాలని కోరారు. అనంతరం ఏఎల్‌ఓ బి.వాల్యానాయక్ మాట్లాడుతూ.. కార్మికులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఆయనను కలిసిన వారిలో లేబర్ సెల్ షాబాద్ అధ్యక్షుడు ముక్కు రవికుమార్ ఉన్నారు.


