● ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి
● రూ.6.10 కోట్లతో బీటీరోడ్డు
నిర్మాణాలకు శంకుస్థాపన
తాండూరు రూరల్: నియోజకవర్గ పరిధి గిరిజన తండాలకు బీటీరోడ్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం పెద్దేముల్, తాండూరు మండలంలో ట్రైబల్ ఎస్‌డీఎఫ్ నిధులు రూ.6.10 కోట్లతో బీటీరోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ– కర్ణాటక సరిహద్దు తాండూరును అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. పెద్దేముల్ మండలం బుద్దారం నుంచి పెద్దేముల్‌తండాకు, బాయిమీదితండా నుంచి షాదిపూర్‌నకు లింకురోడ్లు వేస్తున్నామని తెలిపారు. అలాగే తాండూరు మండలం రాంపూర్‌మీదితండా నుంచి రాంపూర్‌కిందితండా, రాంపూర్ వరకు బీటీరోడ్డు వేస్తామన్నారు. లింకురోడ్లను అభివృద్ధి చేస్తే రవా ణా సౌకర్యం మెరుగు పడుతుందని పేర్కొన్నారు. అంతకు ముందు కందనెల్లి గ్రామంలోని ఉన్నత పాఠశాలకు రూ.7 లక్షలతో ప్రహరీ నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, పార్టీ పెద్దేముల్, తాండూరు మండలాల అధ్యక్షులు గోపాల్, జన్నె నాగప్ప, కోట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, సర్పంచులు వెంకట్‌రెడ్డి, డీవై నర్సింహులు, లక్ష్మప్ప, యాద మ్మ, పురుషోత్తంరెడ్డి, సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.


