దిశా కమిటీ సభ్యుడు వడ్ల నందు
మోమిన్‌పేట: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని దిశా కమిటీ సభ్యుడు వడ్ల నందు అన్నారు. బుధవారం మండలంలోని రాళ్లగుడుపల్లి గ్రామంలో ఎంపీ నిధులు రూ.10లక్షలతో సీసీ రోడ్డు పనులను సర్పంచ్ వర్త్య మహిపాల్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్లు, అంగన్‌వాడీ, డ్వాక్రా భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కరోనా నాటి నుంచి నేటి వరకు ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు అశిరెడ్డి, నాయకులు అరుణ్‌కుమార్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
శంకర్‌పల్లి: యునైటేడ్ నేషన్స్ ఆర్గనైజేన్ సోషల్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో శంకర్‌పల్లి మోడల్ స్కూల్ విద్యార్థి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ శోభారాణి తెలిపారు. నగరంలోని హయత్‌నగర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో బుధవారం ‘మాక్ ఐక్యరాజ్య సమితి సమావేశం’కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శంకర్‌పల్లి మోడల్ స్కూల్ 9వ తరగతి విద్యార్థి నందిని ఉత్తమ ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. తమ పాఠశాల విద్యార్థి రాష్ట్ర స్థాయికి వెళ్లడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థిని సమాయత్తం చేసిన ఉపాధ్యాయురాలు వర సింధూరను ప్రత్యేకంగా అభినందించారు.
కోఆర్డినేటర్ శ్రీనివాసులు
షాద్‌నగర్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు యూనివర్సిటీ ప్రత్యేక ప్రోగ్రాంను రూపొందించినట్లు వర్సిటీ కోఆర్డినేటర్ పాలాది శ్రీనివాసులు తెలిపారు. యూనివర్సిటీ రూపొందించిన ఈ ప్రోగ్రాంకు సంబంధించి వాల్‌పోస్టర్లను బుధవారం షాద్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటుగా, నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రిటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో వివిధ ప్రోగ్రాంలను రూపొందించారని తెలిపారు. పరిశ్రమ ఆధారిత అప్రెంటిషిప్, రిటైల్ రంగ ప్రాక్టికల్ నైపుణ్యాలు, ప్రత్యక్ష వర్క్‌ప్లేస్ లెర్నింగ్ కల్పిస్తున్నట్లు తెలిపారు. వీటిలో చేరిన విద్యార్థులకు నెలకు రూ.12,500–రూ.24 వేల స్టైఫండ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత హాస్టల్, భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు 18005 990101 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఆయన తెలిపారు.


