తుర్కయంజాల్: న్యాయపరమైన డిమాండ్‌లను నెరవేర్చే వరకు నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు అన్నారు. బుధవారం రాగన్నగూడలోని ఇబ్రహీంపట్నం డివిజన్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి, అన్‌మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, బిల్ కలెక్టర్లు, పీస్ రేట్ వర్కర్లను ఆర్టిజన్‌లుగా కన్వర్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సమ్మెలో పాల్గొన్న వారిని ఉద్యోగంలోంచి తీసివేస్తామని బెదిరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. తమకు న్యాయం చేసే వరకు ఎంతటి పోరాటినికై నా సిద్ధమని ప్రకటించారు. 98 ఆర్టీజన్లు ఈ సమ్మెలో పాల్గొన్నారని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సమ్మెలో పాల్గొంటున్నామని వెల్లడించారు.


