తాండూరు టౌన్: జిల్లా కేంద్రం వికారాబాద్‌లో నిలుపుతున్న పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైలును తాండూరు వరకు పొడిగించాలని తాండూరు మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్లు కోరారు. మంగళవారం ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పల్నాడు ఎక్స్‌ప్రెస్ వికారాబాద్ స్టేషన్‌లో కొ న్ని గంటల పాటు నిలిచి ఉంటుందని, అట్టి ట్రైన్‌ను తాండూరు వరకు పొడిగిస్తే వేలాది మంది ప్రజలకు అనుకూలంగా ఉంటుందని కౌన్సిలర్లు నాగా రం నర్సింలు, కిరణ్ ముదిరాజ్, శ్రీకాంత్ రెడ్డి ఎంపీకి విన్నవించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ కౌన్సిలర్లకు వారివారి వార్డుల అభివృద్ధి కోసం ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని, ఆ మాటకు కట్టుబడి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. వార్డు ప్రజల తరఫున ఎంపీకి కౌన్సిలర్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా ఎన్నికై న నాగారం మల్లేశంను ఎంపీ సన్మానించారు.
బీజేపీ కౌన్సిలర్లు నర్సింలు, కిరణ్, శ్రీకాంత్ రెడ్డి
ఎంపీ కొండాకు వినతిపత్రం అందజేత


