ప్రాణం తీసిన ఈత సరదా | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఈత సరదా

Apr 7 2026 9:31 AM | Updated on Apr 7 2026 9:31 AM

నీట మునిగి బాలుడి మృతి

చౌడాపూర్‌ మండలంలో ఘటన

కుల్కచర్ల: ఈత కోసం వెళ్లి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన చౌడాపూర్‌ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్మన్‌కాల్వ గ్రామానికి చెందిన నవాజ్‌ పాషా కుమారుడు శంషీర్‌(9), మరి కొందరు సోమవారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని బావిలో కొందరు ఈత కొట్టడానికి వెళ్లారు. శంషీర్‌ ఈత రాకున్నా బావిలోకి దిగాడు. నీట మునిగి అక్కడిక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబీకుల అక్కడికి చేరుకొని బోరున విలపించారు. శంషీర్‌ స్థానికంగా 4వ తరగతి చదువుతున్నాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

రాష్ట్రంలో బీజేపీదే అధికారం

ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీహరి

తాండూరు రూరల్‌: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బొప్పి శ్రీహరి అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాండూరు మండలం వీర్‌శెట్టిపల్లిలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో కేవలం రెండు ఎంపీ సీట్లతో ప్రారంభమైన బీజేపీ నేడు దేశంలో అతి పెద్ద పార్టీగా అవతరించిందన్నారు. దేశ ప్రజలు మోదీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్‌ జర్నప్ప, నాయకులు తూర్పు శ్రీహరి, ఎర్ర శ్రీనివాస్‌, పరశురాం, నర్సింలు, హరీశ్‌, శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ట్రాక్టర్‌ ఢీకొని వ్యక్తి మృతి

మోమిన్‌పేట: ట్రాక్టర్‌ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మోమిన్‌పేటలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ భరత్‌ భూషణ్‌ తెలిపిన ప్రకారం.. మర్పల్లి మండలం కోట మర్పల్లి గ్రామానికి చెందిన కావలి శేఖర్‌(38), ఆదే గ్రామానికి చెందిన సంజీవులు వద్ద గడ్డి కోసే పనికి కుదిరాడు. సోమవారం మోమిన్‌పేట మండల పరిధి ఏన్కతల గ్రామ శివారు ఓ వెంచర్‌లో గడ్డి కోసేందుకు ఇద్దరు వెళ్లారు. ఈ క్రమంలో వెంచర్‌లోని రోడ్డుపై శేఖర్‌ నడుస్తుండగా వెనుక నుంచి ట్రాక్టర్‌ ఢీ కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్‌ రాజశేఖర్‌ మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కాగా.. మృతుడికి భార్య యాదమ్మ, కూతురు కావేరి, కుమారుడు విష్ణు ఉన్నాడు. యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

జాతీయస్థాయి కబడ్డీ

పోటీలకు విద్యార్థిని ఎంపిక

కందుకూరు: మండల పరిధిలోని గూడూరు గేట్‌ వద్ద ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని అలేఖ్య జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై ంది. గత నెల 30వ తేదీ నుంచి ఈ నెల 2వ తేదీ వరకు మహారాష్ట్ర, కర్ణాటకల్లో నిర్వహించిన 35వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన ఆ విద్యార్థిని తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికై ంది. జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు ఆమె ప్రాతినిధ్యం వహించనుంది. ఈ సందర్భంగా సోమవారం ప్రిన్సిపాల్‌ శ్రీలక్ష్మితో పాటు ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని అభినందించారు.

చికిత్స పొందుతూ

జీపీ కార్మికుడి మృతి

చేవెళ్ల: గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి గాయపరిచిన పంచాయతీ కార్మికుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కమ్మెట గ్రామ పంచాయతీలో ఈనెల 1వ తేదీన చాకలి మల్లయ్య(57)పై దుండగులు కర్రలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. ఉస్మానియా ఆస్పత్రిలో ఐదు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన సోమవారం మృతి చెందాడు. మృతుడిపై దాడి చేసిన వ్యక్తులు ఎవరనేది ఇంకా పోలీసులకు తెలియరాలేదు. విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితులను శిక్షించాలి

కార్మికుడిపై దాడి చేసి హత్యచేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని సీఐటీయూ జిల్లా సహా య కార్యదర్శి అల్లి దేవేందర్‌ డిమాండ్‌ చేశారు. కమ్మెట గ్రామ పంచాయతీలో వాటర్‌మెన్‌గా, డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న మల్లయ్యపై దాడిచేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. కార్మికుడి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement