ప్రపంచానికే ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

ప్రపంచానికే ఆదర్శం

Apr 7 2026 9:25 AM | Updated on Apr 7 2026 9:25 AM

తాండూరు టౌన్‌: భారతీయ కుటుంబ వ్యవస్థ అనేది ప్రపంచానికే ఆదర్శనీయమని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేష్‌ అన్నారు. ఆదివారం రాత్రి పట్టణంలోని సాయిపూర్‌ బస్తీ పరిధిలో ఆర్‌ఎస్‌ఎస్‌ 100 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ కుటుంబాల్లో ఉన్న ఐక్యత, ప్రేమానురాగాలు ప్రపంచంలో ఎక్కడా కనిపించవన్నారు. అందుకే ప్రపంచ దేశ ప్రజలు మన కుటుంబ వ్యవస్త, హిందూ ధర్మం వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. హిందువుల వృద్ధి రేటు ఒకటిన్నర శాతానికి పడిపోయిందని, ఇది భవిష్యత్‌లో ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉందన్నారు. ఐష్టశ్వర్యాల్లో ముఖ్యమైన సంతాన లక్ష్మిని హిందూ మహిళలు దూరం చేసుకోరాదన్నారు. ఒకరిద్దరు పిల్లలతో సరిపెట్టుకోరాదన్నారు. సంతాన భాగ్యాన్ని స్వీకరించి పెద్ద కుటుంబాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత నేటి మహిళలపై ఉందన్నారు. అన్యమతస్కులు లవ్‌ జిహాద్‌ పేరుతో హిందూ యువతులను మోసం చేస్తూ, ధర్మాన్ని నాశనం చేయాలని కుట్రలు చేస్తున్నారని, లవ్‌ జిహాద్‌ను అడ్డుకునే తత్వం ప్రతి ఇంటి నుంచి ప్రారంభం కావాలన్నారు. అనంతరం వివేకానంద సామాజిక సేవా సంస్థ ప్రచారకులు కృష్ణ స్వామి మాట్లాడుతూ.. హిందూ పండుగలు, పూజా విధానాలన్నింటిలో సైన్స్‌ దాగి ఉందన్నారు. హిందూ ధర్మం జీవన విధానాన్ని నేర్పిస్తుందన్నారు. అనంతరం వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి తూర్పు శ్రీలతారెడ్డి మాట్లాడుతూ.. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను మహిళ తన సంతానికి నేర్పించాలన్నారు. పాశ్యాత్య పోకడలకు పిల్లలు ఆకర్షితులు కాకుండా చూసుకోవాలన్నారు. వారిని సన్మార్గంలో నడిపే బాధ్యత ప్రతి మహిళపై ఉందన్నారు. చిన్నారుల నృత్య ప్రదర్శన, కలరియ పట్టు విన్యాసాలు ఎంతో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వివేకానంద సామాజిక సేవా సంస్థ ప్రచారకులు కృష్ణ స్వామి, హిందూ సమ్మేళన ఉత్సవ సమితి సాయిపూర్‌ బస్తీ అధ్యక్షుడు ముదెళ్లి అశోక్‌, ఉపాధ్యక్షురాలు అనితా ఠాకూర్‌, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

భారతీయ కుటుంబ వ్యవస్థ

ఎంతో గొప్పది

హిందూ పూజా విధానాలకు

సైన్స్‌తో అనుబంధం

లవ్‌ జిహాద్‌ను అరికట్టాల్సింది మనమే

హిందుత్వం అంటే ఒక జీవన విధానం

ఆర్‌ఎస్‌ఎస్‌ తెలంగాణ ప్రాంత

కార్యవాహ కాచం రమేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement