కుల్కచర్ల: నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని కుల్కచర్ల పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ రమేశ్ తెలిపిన ప్రకారం.. మండల కేంద్రంలో రేషన్ బియ్యం నిల్వలు ఉన్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు వారు పలు దుకాణాలపై దాడులు చేపట్టగా ముగ్ద రవితేజ వద్ద 31 సంచులు, అంగడి ప్రదీప్ వద్ద 38 బియ్యం బస్తాలు లభ్యమయ్యాయి. పోలీసులు వాటిని సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
కుల్కచర్ల: అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఎస్‌ఐ రమేశ్ తెలిపిన ప్రకారం కుస్మసముద్రం గ్రామానికి చెందిన దస్తయ్య ఇసుకను తరలిస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులు వాహనాన్ని నిలిపి అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించగా లేవని సమాధానం చెప్పాడు. దీంతో ట్రాక్టర్‌ను ఠాణాకు తరలించి దస్తయ్యపై కేసు నమోదుచేశారు.
అదుపుతప్పి కారు బోల్తా
దోమ: అడవి పంది అడ్డురావడంతో అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ సంఘటన దోమ మండలం మోత్కూర్ గేట్ సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నంచర్ల గ్రామం నుంచి స్విఫ్ట్ డిజైర్ వాహనం కుల్కచర్ల మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తోంది. అందులో డ్రైవర్‌తో పాటు ఓనర్ ఉన్నారు. ఈ క్రమంలో గేట్ సమీపంలోకి రాగానే వరాహం అడ్డువచ్చింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ దానిని తప్పించే యత్నంలో కారు.. రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఎయిర్ బెలూన్స్ తెరచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.
కుటుంబ సభ్యులకు
అండంగా ఉంటాం
పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
దోమ: మండల పరిధిలోని ఐనాపూర్‌లో జోగు చిన్న భీమయ్య శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఆదివారం మృతదేహాన్ని నివాళి అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా కల్పించారు.
వృద్ధురాలు అదృశ్యం
గుర్తు తెలియని వ్యక్తి
మృతదేహం లభ్యం
అనంతగిరి: మున్సిపల్ పరిధి గిరిగేట్‌పల్లి రైల్వే గేట్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైంది. వికారాబాద్ రైల్వే పీఎస్ ఇన్‌చార్జి హరిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలికి వెళ్లి వివరాలు సేకరించారు. చనిపోయిన వ్యక్తికి సుమారు 40 ఏళ్లు ఉంటాయి. శవం పూర్తిగా కుళ్లి పోయిన స్థితిలో గుర్తు పట్టలేని విధంగా ఉంది. మృతుడికి తెలుపురంగు గడ్డం కలిగి, జుట్టు నెరసి ఉంది. ఒంటిపై తెలుపు రంగు ఫుల్ షర్ట్, నీలం కలర్ ప్యాంట్ కలిగి ఉండి.. షర్ట్ కాలర్‌పై ఎస్‌కే టైలర్స్ వికారాబాద్ అనే స్టిక్కర్ ఉంది. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.


