రెండు బైకులు చోరీ | - | Sakshi
Sakshi News home page

రెండు బైకులు చోరీ

Apr 5 2026 9:18 AM | Updated on Apr 5 2026 9:18 AM

మొయినాబాద్‌: ఇంటి ఎదుట పార్కుచేసిన రెండు బైకులను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మొయినాబాద్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నర్సింహారావు తెలిపిన ప్రకారం.. మొయినాబాద్‌కు చెందిన మహమ్మద్‌ యూసుఫ్‌ టీఎస్‌ 11 ఈఎక్స్‌ 5870 నెంబరు గల యమహా బైక్‌ను ఈ నెల 1న రాత్రి తన ఇంటి ఎదుట పార్కు చేశాడు. మొయినాబాద్‌కు చెందిన మెరుగు రమేశ్‌ టీఎస్‌ 06 ఈఎం 5046 నెంబరు గల స్ప్లెడర్‌ ప్లస్‌ బైకును ఈ నెల 1న రాత్రి తన ఇంటి ముందు పార్కుచేసి పడుకున్నాడు. గుర్తుతెలియని దుండగులు అర్థరాత్రి సమయంలో రెండు బైకులను ఎత్తుకెళ్లారు. ఈ విషయమై బాధితులు శనివారం మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

యుద్ధ వ్యతిరేక సదస్సును విజయవంతం చేయండి

షాద్‌నగర్‌: సామ్రాజ్యవాద యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ శాంతికోసం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో నేడు(ఆదివారం)నిర్వహించనున్న సదస్సును విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు కోరారు. శనివారం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో యుద్ధ వ్యతిరేక సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సదస్సుకు ప్రొఫెసర్‌ హరగోపాల్‌, ప్రొఫెసర్‌ విజయ్‌, రాఘవాచారి హాజరవుతారన్నారు. అన్నివర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యకరమంలో ప్రజా సంఘాల నాయకులు శ్రీనివాస్‌, రవీంద్రనాథ్‌, నర్సింలు, నర్సింలు, సత్యం, కృష్ణ, తిరుమలయ్య, ఈశ్వర్‌నాయక్‌, కృష్ణయ్య, సత్యనారాయణ, కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

వ్యక్తి బలవన్మరణం

శంకర్‌పల్లి: ఒంటరితనం భరించలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం రావులపల్లి కలాన్‌లో చోటు చేసుకుంది. సీఐ ముదస్సర్‌ అలీ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన ఇంద్రేశం బుచ్చయ్యకి ఇద్దరు కుమారులు. వారిలో చిన్నవాడు మల్లేశం(34) పూల డెకరేషన్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకి ఎనిమిదేళ్ల క్రితం తాండూరుకి చెందిన నవనీతతో వివాహమైంది. వీరికి ఒక కొడుకు, కుమార్తె సంతానం. ఏడాది క్రితం భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో నవనీత పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో మల్లేశంకి ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. తర్వాత కోలుకున్నప్పటికీ ఒంటరితనంతో జీవితంపై విరక్తి చెందిన ఆయన శుక్రవారం రాత్రి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శనివారం మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అనంతరం బాడీని కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement