ఉత్తమ పోలీసులకు పతకాలు
అనంతగిరి: శాంతిభద్రతల పరిరక్షణ, విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వికారాబాద్ జిల్లాకు చెందిన ఐదుగురు పోలీస్ అధికారులను ప్రభుత్వం ఉత్తమ సేవ పతకాలతో సత్కరించింది. నూతన సంవత్సర పురస్కారాలలో భాగంగా ప్రకటించిన ఈ పతకాలను అందుకున్న వారిలో డీఎస్బీ ఎస్‌ఐ శ్రవణ్‌కుమార్, ఏఆర్ ఎస్‌ఐలు కె.మోహన్‌రాజ్, ప్రకాశ్, పి.సంజీవయ్య, హెడ్ కానిస్టేబుల్ ఎస్.విఠలయ్య ఉన్నారు. ఎస్పీ స్నేహమెహ్ర వీరిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అంకితభావంతో పనిచేసే వారికి డిపార్ట్‌మెంట్‌తో పాటు ప్రజల్లోనూ తగిన గుర్తింపు ఉంటుందన్నారు.
సైబర్ వారియర్‌కు స్టేట్ అవార్డు
సైబర్ నేరాల నియంత్రణలో ప్రతిభ చూపిన మోమిన్‌పేట్ పోలీస్ స్టేషన్ సైబర్ వారియర్ (కానిస్టేబుల్) ఎండీ జావిద్‌పాషా రాష్ట్ర స్థాయి పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్‌లోని స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ శివధర్‌రెడ్డి,ఐ సైబర్ సెక్యూరిటీ అడిషనల్ డీజీ షికాగోయల్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం, రివార్డు తీసుకున్నారు.
ఉత్తమ పోలీసులకు పతకాలు
ఉత్తమ పోలీసులకు పతకాలు
ఉత్తమ పోలీసులకు పతకాలు
ఉత్తమ పోలీసులకు పతకాలు
ఉత్తమ పోలీసులకు పతకాలు
ఉత్తమ పోలీసులకు పతకాలు


