ఎంపీడీఓ అన్వర్‌పై విచారణ
కుల్కచర్ల: ఉపాధిహామీ పథకంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో గతంలో ఎంపీడీఓగా విధులు నిర్వహించిన తారిక్‌అన్వర్‌పై అడిషనల్ కలెక్టర్ సుధీర్ విచారణ చేపట్టారు. మంగళవారం కుల్కచర్ల ఎంపీడీఓ కార్యాలయంలో డీఆర్డీఓ శ్రీనివాస్‌లు 2018–19లో జరిగిన హామీ పథకంలో క్షేత్రస్థాయిలో పనులు చేయకముందే రికార్టుల్లో చేసినట్లు నమోదు చేశారు. దీంతో 2021లో జరిగిన సామాజిక తనిఖీలో ఎంపీడీఓ తారిక్ అన్వర్‌పై రూ.80 వేల జరిమానా విధించారు. ఈ విషయంపై పలు దఫాల నోటీసుల అనంతరం విచారణను చేపట్టా రు. మంగళవారం జరిగిన విచారణలో తారిక్‌అన్వర్‌కు మూడు రోజులు సమయం ఇచ్చి సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించాలని సూచించినట్లు చె ప్పారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, ఉపా ధి సిబ్బంది మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.


