పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వ చేయూత
అనంతగిరి: సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆఫీసర్ నవీన్‌కుమార్ బసురి అన్నారు. బుధవారం డీఆర్డీఏ కార్యాలయంలో పీఎంఎఫ్‌ఎంఈ పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ పథకంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించి, గరిష్ట సంఖ్యలో లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం డీఆర్డీఏ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి వివరించారు. వ్యక్తిగత యూనిట్లకు 35 శాతం రాయితీతో గరిష్టంగా రూ.10 లక్షల వరకు సబ్సిడీ అందుబాటులో ఉందన్నారు. ఎఫ్‌పీఓలు, స్వయం సహాయక సంఘాలు, ప్రొడ్యూసర్ గ్రూపులు గరిష్టంగా రూ.3 కోట్ల వరకు రాయితీ పొందవచ్చని తెలిపారు. యంత్రాల కొను గోలుతోపాటు బ్రాండింగ్, ప్యాకేజింగ్, లేబెలింగ్ మార్కెటింగ్ లింకేజీల కోసం ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. ఈ పథకంపై ఆ సక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలనుకునే సూ చించారు. మరిన్ని వివరాల కోసం జిల్లా పరిశ్రమల కేంద్రం లేదా జిల్లా రిసోర్స్ పర్సన్ ఫణిభూషణ్‌ను లేదా సెల్ నంబర్ 7780119648లో సంప్రదించాల న్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సంబంధిత విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆఫీసర్ నవీన్‌కుమార్ బసురి


