నకిలీ సర్టిఫికెట్ల రాకెట్‌లో..
బషీరాబాద్: నకిలీ సర్టిఫికెట్ల రాకెట్‌లో అంతర్రాష్ట్ర ముఠా హస్తం ఉన్నట్లు పోలీసుల విచారణలో బయటబడింది. దొంగ సర్టిఫికెట్ల కేసులో బషీరాబాద్‌లో పట్టుబడిన కోవూరు ప్రవీణ్ పోలీసులకు ఇచ్చిన సమాచారంతో తాండూరు పట్టణానికి చెందిన కుమ్మరి అశోక్, అతడి సోదరుడు నవీన్‌ను బుధవారం అదుపులోకి తీసుకొని ప్రత్యేక పోలీసు బృందం విచారిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు భూములకు సంబంధించిన నకిలీ పత్రాలను బీహార్ కేంద్రంగా తయారు చేస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, బిహార్, గుజరాత్‌లోనూ అక్కడి ప్రభుత్వాలు జారీ చేసినట్లు ఆయా ప్రాంతాల భాషల్లో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కేటుగాళ్లు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే అనేక రకాల సర్టిఫికెట్లను నకిలీవి జారీ చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో పట్టణానికి చెందిన ఆసీఫ్ అనే మరో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. పట్టణంలోని తన ఇంటర్నెట్ సెంటర్‌ను మూతవేసి పరారీ అయినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిపింది. నకిలీ సర్టిఫికెట్ల రాకెట్‌లో భాగస్వాములైన అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకోవడానికి తాండూరు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ కేసు విచారణ పూర్తి కావడానికి వారం రోజులైన పడుతుందని పోలీసు అధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు.
కర్ణాటక రాష్ట్రం సేడం ఆస్పత్రి చిరునామాతో జారీ చేసిన ఫేక్ బర్త్ సర్టిఫికెట్, నిందితుడు ప్రవీణ్
అంతర్రాష్ట్ర ముఠా
బిహార్, గుజరాత్, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ దందా!
కదులుతున్న డొంక
ముగ్గుర్ని విచారిస్తున్న పోలీసులు
నకిలీ సర్టిఫికెట్ల రాకెట్‌లో..


