యూటీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ
దోమ: ఉపాధ్యాయుల పక్షాన టీఎస్ యూటీఎఫ్ నిరంతరం పని చేస్తుందని ఆ సంఘం జిల్లా కార్యదర్శి ముత్యప్ప, మండల అధ్యక్షుడు మేగ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎమ్మార్సీలో ఎంఈఓ వెంకట్, స్థానిక సర్పంచ్ మాలి శివకుమార్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ నర్సింహులుతోకలిసి యూటీఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ వెంకటయ్య, మండల ప్రధాన కార్యదర్శి జంగయ్య, నేతలు రవికుమార్, వెంకటయ్య, రాములు, మల్లేశ్, అనంతయ్య, నరేందర్, శ్రీనివాస్, రాజు, శేఖరయ్య, జలాలొద్దీన్, సావిత్రి, స్వరుప, పీఏసీఎస్ డైరెక్టర్ జాకటి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి షఫీ
దోమ: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎస్టీయూ నిరంతరం కృషి చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి షఫీ తెలిపారు. బుధవారం మండలంలోని బొంపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఎంఈఓ వెంకట్, సంఘం నేతలతో కలసి నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమ స్యలను పరిష్కరించేలా తాము ముందుండి పోరాటం చేసేందుకు పని చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఖయ్యుం, నేత లు వెంకటయ్య, ముత్యప్ప, నరేందర్, సావిత్రి, కల్పలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్
తాండూరు: కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల కమిటీల్లో సమర్థులైన నాయకులకే అవకాశం కల్పించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ తెలిపారు. బుధవారం పట్టణంలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ ముఖ్య నాయకులతో పార్టీ సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కల్వ సుజాత, పార్టీ పరిశీలకులు వినోద్‌రెడ్డి, రాంశెట్టి నరేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా స్థాయి పదవుల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పార్టీ కోసం అంకిత భావంతో పని చేసే వారికి తొలి ప్రాధాన్యం ఉంటుందన్నారు. సర్పంచ్ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పని చేయాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ రవిగౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు హబీబ్‌లాల, ఆయా మండలాల అధ్యక్షులు, సర్పంచ్‌లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పరిగి డీఎస్పీ శ్రీనివాస్
పరిగి: విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే మంచి గుర్తింపు లభిస్తుందని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కుల్కచర్ల మండలం ఇప్పాయిపల్లి గ్రామానికి చెంది నరేష్ ఇంటర్ చదువుతున్నాడు. అండర్–19 జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. బుధవారం క్రీడాకారుడిని ఘనంగా సన్మానించారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురేందర్, స్వే రోస్ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు వెంకటయ్య, వినోద్‌కుమార్, చంద్రయ్య, బుగ్గయ్య, ఆనంద్, నరేందర్ పాల్గొన్నారు.
యూటీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ
యూటీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ
యూటీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ


