ఐదు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
యాలాల: అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని యాలాల ఎస్‌ఐ విఠల్‌రెడ్డి హెచ్చరించారు. మండలంలోని కోకట్, బెన్నూరు, అగ్గనూరు శివారులోని కాగ్నా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పట్టుకొని పీఎస్‌కు తరలించారు. మంగళవారం ఆయా ప్రాంతాల్లో ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారనే సమాచారంతో అగ్గనూరు శివారులో మూడు ట్రాక్టర్లు, కోకట్, బెన్నూరు శివారులో రెండు ట్రాక్టర్లను గుర్తించి పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వాహనాలను యాలాల పీఎస్‌కు తరలించారు. ఇసుక అక్రమ రవాణా జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పట్టుబడిన వాహనాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
అమెరికా దాడులు సరికావు
పరిగి: వెనిజులా దేశంపై అమెరికా చేసిన దాడి సరికాదని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.వెంకటయ్య అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలో అంబేడ్కర్ విగ్రహం ఎదుట నేతలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంగిస్తూ, ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్న అమెరికన్ సామ్రాజ్యవాద దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు హాబీబ్, సత్తయ్య, మొగులయ్య, రమేశ్, మహబూబ్, వెంకటయ్య, సలీం తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభమైన
కోట్‌పల్లి ప్రాజెక్టు పనులు
ధారూరు: జిల్లాలోని కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునీకరణ పనులు ప్రారంభమయ్యాయి. మంగళవారం ప్రాజెక్టు కుడి కాలువ ముందు భాగంలో పనులు హిటాచీ ద్వారా కొనసాగిస్తున్నా రు. కుడి కాలువ తూము నుంచి నాగసమందర్ గ్రామం వైపు వెళ్లే ప్రధాన పాత కాలువను తవ్వి పనులు చేపట్టారు. కాలువకు రెండు వైపు లా రాళ్లతో నిర్మించిన గోడలను తొలగిస్తున్నా రు. ఈ పనులను ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలతో పాటు బేబీ కెనాల్‌ను, ప్రాజెక్టు కట్ట, అలు గు తదితర పనుల వివరాలను తాండూరు ఇరిగేషన్ డీఈ మోతియా మంగళవారం వివరించారు. కుడి కాల్వలో రీసెక్షనింగ్ ఆఫ్‌ది కెనాల్ ఎర్త్‌వర్క్ ప్రారంభించారన్నారు. పనులు వేగవంతంగా జరుపుతున్నట్లు వివరించారు.
ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్
బంట్వారం: మండల కేంద్రం బంట్వారం శివారులో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. బంట్వారం–సల్బత్తాపూర్ రోడ్డు మార్గంలో ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ను రోడ్డు పక్కనే చిన్న పాటి దిమ్మె కట్టి పెట్టారు. అటుగా నడుచుకుంటూ వెళ్లే వారు సైతం ఆదమరిస్తే అంతే సంగతులు. రోడ్డు పక్క నుంచి వెళ్లే మూగ జీవాలకు కూడా ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికై నా ట్రాన్స్‌కో అధికారులు స్పందించి సత్వరమే తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఐదు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
ఐదు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
ఐదు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత


