కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి
సీఐటీయూ జిల్లా కోశాధికారి చంద్రయ్య
కొడంగల్ రూరల్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి బుస్స చంద్రయ్య పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా సమీపంలో పలు సంఘాల నాయకులతో కలిసి పోస్టర్ విడుదల చేశారు. ఈ నెల 7న తేదీ వరకు గ్రామాల్లో ముమ్మర ప్రచారం నిర్వహిస్తూ 8 నుంచి 18వ తేదీ వరకు జాతాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 19న జిల్లా కేంద్రాల్లో ప్రదర్శన సభలు ఉంటాయని చెప్పారు. 11 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రజల హక్కులను, రాష్ట్ర హక్కులను కాలరాస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదకరమైన నాలుగు లేబర్ కోడ్లను అమలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వీబీజీ రామ్‌జీ చట్టాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రాజేందర్, శివకుమార్, గణేష్‌నాయక్, రవీందర్, ప్రవీణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


