
ఆదివారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2025
స్వార్థం లేనిది స్నేహం
ముందుగా రాష్ట్ర, జిల్లా ప్రజలకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.. దేనిలోనైనా స్వార్థం ఉంటుందేమోకానీ స్నేహం విషయంలో ఉండదు. స్వార్థం ఉంటే స్నేహం అనిపించుకోదు.. నిజమైన స్నేహం ఏమీ ఆశించదు. అలాంటి వారు ఉంటే ఎలాంటి కష్టాలనైనా ధైర్యంగా ఎదుర్కోగలం.. అంతటి గొప్ప మిత్రులు నాకు ఉన్నారు. మా స్వగ్రామం తాండూరు.. చదువుకునే రోజుల్లో స్నేహితులతో కలిసి వాలీబాల్, బ్యాడ్మింటన్ ఆడేవాళ్లం. సుదర్శన్‌గౌడ్, ప్రకాష్‌గౌడ్, రాములు యాదవ్, రమేశ్‌కుమార్, జగన్మోహన్, మధుకర్, వెంకటయ్య నా చిన్ననాటి స్నేహితులు.. బాల్యం మొత్తం వీరితోనే గడిపా. సమయం చిక్కినప్పుడల్లా వీరందిరితో మాట్లాడుతుంటా. చిన్నతనంలో చేసిన అల్లరి, సరదాగా గడిపిన రోజులు గుర్తుకు వస్తే మనస్సంతా ప్రశాంతంగా ఉంటుంది. ఆ అనుభూతే వేరు.. – గడ్డం ప్రసాద్‌కుమార్, శాసన సభ స్పీకర్
న్యూస్‌రీల్

ఆదివారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2025