
పాతికేళ్ల బంధం మాది
షాబాద్: కష్ట సుఖాల్లో తోడుగా నిలిచే వాడే నిజమైన స్నేహితుడు. అలాంటి మిత్రుడే ఓంకార్. పాతిక సంవత్సరాలుగా ఎంతో అన్యోన్యంగా ఉంటుంన్నాం. సమయం దొరికినప్పుడల్లా కలుస్తాం. ఇటీవల మరో స్నేహితుడు శ్రీనివాస్‌రెడ్డి రెండు కిడ్నీలు చెడిపోయి మృతి చెందాడు. ఆ కుటుంబానికి స్నేహితలందరూ అండగా నిలిచారు. రూ.7 లక్షలు సేకరించి శ్రీనివాస్‌రెడ్డి పిల్లల పేరిట బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాం. మా వాడి పిల్లలు అనాథలు కారాదనే ఈ నిర్ణయం తీసుకున్నాం. స్నేహానికి కు ల, మత తారతమ్యాలు ఉండవు. అమ్మ నాన్న తర్వాత దేవుడిచ్చిన బహుమతే స్నేహితుడు.
– బి.కాంతారెడ్డి, సీఐ, షాబాద్
ప్రతిఫలం ఆశించనిదే..
స్నేహబంధం ఎంతో విలువైంది. ఇంట్లో వారితో చెప్పుకోలేని విషయాలు కూడా స్నేహితులతో పంచుకోవచ్చు. స్నేహంతో బంధాలు ఎంతో బలపతాయి. ఫ్రెండ్స్‌తో ఉండే ఆనందం వెలకట్టలేనిధి.
– సంగమేశ్వర్‌రెడ్డి, టీచర్,
తాళ్లపల్లి పాఠశాల, షాబాద్ మండలం
ఒకే గిన్నెలో తిన్నాం
నేను నా స్నేహితురాలు స్వాతి ఇద్దరం కే దగ్గర చదువుకున్నాం. నేను ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్నాను. స్వాతి వరంగల్‌లో టీచర్‌గా పని చేస్తోంది. మా స్నేహం విడదీయరానిది. మేము చదువుకునే రోజుల్లో ఇద్దరం ఒకే గదిలో ఉండి వాళ్లం. ఒకే గిన్నెలో తిన్నాం. ఇప్పటికీ అదే ఆప్యాయతతో కలిసి ఉన్నాం.
– అపర్ణ, ఎంపీడీఓ, షాబాద్

పాతికేళ్ల బంధం మాది

పాతికేళ్ల బంధం మాది