
ముర్రుపాలు శ్రేష్టం పుట్టిన బిడ్డకు తొలి ఆహారం, మొదటి ట
8లోu
9లోu
గుర్తొస్తే ఒల్లు పులకరించి పోతుంది
కాలంతో పాటు మనం ప్రయాణిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఎంతో మంది పరిచయం అవుతారు.. అందులో కొందరిని కాలక్రమేణా మరిచిపోతాం.. కొందరు మాత్రం కాలాన్నే మరిపిస్తారు.. వారే మనకు ఇష్టమైన స్నేహితులుగా గుర్తుండిపోతారు.. వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తారు.. స్కూల్, కాలేజీ లైఫ్‌లో ఏర్పడిన స్నేహబంధాలు ఎంతో బలపడతాయి.. మా స్వగ్రామం బాన్స్‌వాడ స్కూల్ డేస్‌లో ఇద్దరు మిత్రులు ఉండేవారు.. వారిద్దరూ పదో తరగతిలోనే చదువు మానేశారు. నేను 6 నుంచి ఇంటర్ వరకు నవోదయ స్టూడెంట్‌ని.. పీజీ వరకు హాస్టల్‌లో ఉండి చదువుకున్నా. నా లైఫ్‌లో ఎక్కువ కాలం స్నేహితులతోనే గడిపా. నా ఎదుగుదలకు కూడా వారు ఎంతో దోహదపడ్డారు. ఏటా వారితో మీట్ అవుతా. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాను.. ఆ సమయంలో ఎంతో ఆనందం కలుగుతుంది. ఏదో తెలియని అనుభూతి చెందుతా. కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడు నవ్వు ఆపుకోలేను.
– జయసుధ, డీపీఓ