
వారు దేవుడిచ్చిన వరం
చేవెళ్ల: స్నేహం అనేది నాకు దేవుడిచ్చిన వరం. తల్లిదండ్రుల తర్వాత స్నేహితులే ముఖ్యం అని చేవెళ్ల తహసీల్దార్ బి.కృష్ణయ్య అన్నారు. చిన్ననాటి స్నేహితులు పి.శ్రీనివాస్, ఐ.కృష్ణయ్య, కె.నర్సింలు జ్ఞాపకాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. పరిగి మండలం రూప్‌ఖాన్‌ేపేటకు చెందిన మేమందరం పాఠశాల స్థాయి నుంచే స్నేహితులం. అంతేకాకుండా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌గా కొనసాగుతున్నాం. ముగ్గురూ నాకంటే ఒక్క క్లాస్ సీనియర్లు.. మా మైత్రి పదో తరగతి వరకు సాగింది. ఇంటర్, డిగ్రీ వేర్వేరు కళాశాలల్లో చదువుకున్నా రోజూ కలిసేవాళ్లం. వృత్తి రీత్యా వివిధ రంగాల్లో రాణిస్తున్నాం. నేను తహసీల్దార్‌గా, నర్సింలు హెడ్‌కానిస్టేబుల్‌గా. కృష్ణయ్య వ్యవసాయం, శ్రీనివాస్ వ్యాపారం చూస్తూ స్థిరపడ్డాం. ఆదివారం, సెలవు రోజుల్లో కలుసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఎవరి కుటుంబంలో సమస్య వచ్చినా కలిసి పరిష్కరించుకుంటాం. మిత్రులందరికీ స్నేహితుల రోజు శుభాకాంక్షలు.
– బి.కృష్ణయ్య, తహసీల్దార్, చేవెళ్ల