
బాల్య మిత్రులు.. ‘బాధ్యత’గా..
కొడంగల్: కొడంగల్ ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1990 బ్యాచ్‌కు చెందిన కొందరు విద్యార్థులు 16 ఏళ్ల క్రితం బాధ్యత అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. వారు సంపాదించిన డబ్బులో కొంత సమాజసేవకు వినియోగిస్తున్నారు. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు ఏటా ఉచితంగా నోటు పుస్తకాలు, పలకలు, పెన్నులు, పెన్సిల్స్ పంపిణీ చేస్తున్నారు. కటుకం వెంకటేశ్, మురహరి వశిష్ట, శివకుమార్ గుప్తా, లక్ష్మీనారాయణ జోషి, కిట్టుస్వామి, కృష్ణారావు, కొంతం సతీష్, నగేశ్, ఆనంద్ కుమార్ లాహోటీ, కానుకుర్తి రమేష్, వేణు, బాలరంగాచారి మంచి స్నేహితులు. ఫ్రెండ్‌షిప్‌కు ఆదర్శంగా నిలుస్తున్నారు. గతంలో పాలమూరు జిల్లాను వరదలు ముంచెత్తి నప్పుడు ప్రజల సహకారంతో రూ.2.5 లక్షల విలువ చేసే సరుకులు, మందులు, దుస్తులను మాగనూరు మండలంలోని కృష్ణా నది పరీవాహాక ప్రాంతంలో పంపిణీ చేశారు.