
సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం
తాండూరు: ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రజారోగ్యాఽనికి పెద్ద పీట వేస్తున్నామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. శనివా రం ఎమ్మెలే క్యాంపు కార్యాలయంలో పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, తాండూరు మండలాలతో పాటు మున్సిపల్ పరిధిలో అనారోగ్యంతో కార్పొరేట్ ఆస్పత్రులలో వైద్య సేవలు పొందిన వారికి సీఎం సహాయనిధి చెక్కులు అందజేశారు. 170 మంది లబ్ధి దారులకు రూ.56.60 లక్షలకు సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గం ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. పేదల ఆరోగ్యం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు ఆర్థికభరోసా కల్పిస్తోందన్నారు.
ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి