
నాటారు.. నరికారు..
తాండూరు: మొక్కలు నాటి చెట్లను పెంచాలని ఓ వైపు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. వనమహోత్సవం పేరిట తాండూరు మున్సిపాలిటీకి లక్ష్యం నిర్దేశించారు. కాని లక్ష్యం పక్కన పెట్టి అధికారులు మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని చెట్లను నరకడం వివాదాస్పదంగా మారింది. మున్సిపల్ కార్యాలయ భవనం వెనకల నాలుగేళ్ల క్రితం నాటిన మొక్కలు చెట్లుగా మారాయి. కార్యాలయ ప్రాంగణంలో మాత్రం కారణం లేకుండానే నరకడం విమర్శలకు తావిస్తోంది.
తాండూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట చెట్ల నరికివేత