![A-Æý‡$á-ÌS…-§ýl-ÇMîS çÜ…„óSÐ]l$ ç³£ýlM>Ë$](/styles/webp/s3/article_images/2025/08/3/02vkb51-360020_mr-1754191419-0.jpg.webp?itok=kXh2kGmQ)
A-Æý‡$á-ÌS…-§ýl-ÇMîS çÜ…„óSÐ]l$ ç³£ýlM>Ë$
మర్పల్లి: పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. కల్కోడ, ఘనాపూర్‌లో పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. మండలంలోని అన్ని చెరువుల వివరాలు సేకరించి మరమ్మతులు చేపట్టి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతానన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, దరఖాస్తులు చేసుకుంటే చెత్తబుట్టలో పడేశారన్నారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్న ఏకై క రాష్ట్రం తెలంగాణ అన్నారు. రైతాంగం కోసం గత యేడాదిన్నరలో లక్షా 5 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని తెలిపారు. అనంతరం ఎనిమిది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు గూడెం రాములుయాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సురేష్, వైస్ చైర్మన్ మల్లేశ్‌యాదవ్, సహకార సంఘం వైస్ చైర్మన్ ఫసియోద్దీన్, బ్లాక్ టూ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గణేష్, నాయకులు జగదీశ్వర్, రఘుపతి రెడ్డి, రామేశ్వర్, రాచన్న, శేఖర్‌యాదవ్, నర్సింలుయాదవ్, సర్వేష్, రఫీ, వెంకట్ రెడ్డి, అశోక్ రెడ్డి, తహసీల్దార్ పురుషోత్తం, ఎంపీడీఓ సిటి జయరాం, స్పెషల్ ఆఫీసర్ మోహన్ కృష్ణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
చెరువులను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతా
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్