
సీజనల్‌పై అప్రమత్తంగా ఉండాలి
అనంతగిరి: ప్రస్తుతం సీజనల్ వ్యాధుల నమోదయ్యే అవకాశం ఉన్నందున వైద్యులందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ నరేందర్ కుమార్ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన వికారాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలోని పలు విభాగాలను పరిశీలించి అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. వైద్యులకు ఆస్పత్రిలో సేవల విస్తరణ కోసం తగు సూచనలు చేశారు. అనంతరం పట్టణంలోని పాత ఆస్పత్రిలో నిర్వహిస్తున్న మాతా శిశు సంరక్షణ సేవలను ఆయన పరిశీలించారు. ఆస్పత్రిలో వివిధ విభాగాల్లో జరుగుతున్న మరమ్మతులు, మార్పులపై ఆరా తీశారు. అక్కడి నుంచి రామయ్యగూడ పీహెచ్‌సీ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ అందజేస్తున్న సేవలకు సంబంధించి వివరాలు తెలుసుకోవడంతో పాటు పలు రికార్డులను ఆయన పరిశీలించారు. వైద్యులంతా అప్రమత్తంగా ఉండి ప్రజలకు సేవలు అందించాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బందితో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్, డాక్టర్ రాంచంద్రయ్య, ఆయా విభాగాల వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ నరేందర్ కుమార్