
గంజాయి విక్రేతల అరెస్టు
పరిగి: గంజాయి తరలిస్తుండగా ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న సంఘటన శనివారం మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లి గేట్ సమీపంలో చోటు చేసుకుంది. జిల్లా టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలో గంజాయి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారంతో లక్ష్మీదేవిపల్లి గేట్ సమీపంలో సోదాలు నిర్వహించారు. బైక్‌పై ఇద్దరిని తనిఖీ చేసి 260 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిని పరిగి పట్టణ కేంద్రానికి చెందిన నీరజ్‌కుమార్, షాద్‌నగర్ మండలం ఎలికట్టే గ్రామానికి చెందిన విపిన్ కాంకర్‌లుగా గుర్తించారు. వారి వద్ద ఉన్న బైక్‌ను సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఎక్కడైన గంజాయి విక్రయించినా, తరలించినా వెంటనే సమాచారం అందించాలని సూచించారు. మాదక ద్రవ్యాల నివారణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు. మత్తు పదార్థాలు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆబ్కారీ అధికారులు పాల్గొన్నారు.