
పింఛన్ హామీ నిలబెట్టుకోవాలి
ఎంఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు సోమశేఖర్ మాదిగ
దోమ: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన పింఛన్ హామీని నిలబెట్టుకోవాలని ఎంఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని బొంపల్లిలో ఎంఎస్‌ఎఫ్ ఏపీ అధ్యక్షుడు వై.కె.విశ్వనాథ్ మాదిగ, మండల ఉపాధ్యక్షుడు డి.వెంకటేశ్‌తో కలిసి దివ్యాంగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 2న కొడంగల్ పట్టణంలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పింఛన్ డబ్బు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్ మాదిగ, గ్రామ అధ్యక్షుడు టి.శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఎం.శ్రీనివాస్, దివ్యాంగుల సంక్షేమ సంఘం గ్రామ అధ్యక్షుడు కె.ఆంజనేయులు పాల్గొన్నారు.