
సేవలే చిరస్థాయిగా ఉంటాయి
అనంతగిరి: విధి నిర్వహణలో మనం చేసిన సేవలే చిరస్థాయిగా ఉంటాయని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్‌లో ఎస్‌ఐగా సేవలందించి, పదవీ విరమణ పొందిన ఎండీ శయిదుద్దీన్‌కు గురువారం వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ఎండీ శయిదుద్దీన్‌ను సన్మానించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సుదీర్ఘ సేవలను, అంకితభావాన్ని క్రమశిక్షణను కొనియాడారు. 38 ఏళ్లకు పైగా ఎలాంటి రిమార్క్ లేకుండా క్రమశిక్షణతో విధులు నిర్వహించడం ప్రశంసనీయం అన్నారు. పోలీస్ ఉద్యోగం సవాలుతో కూడుకున్నదని, కుటుంబ సభ్యుల సహకారం లేనిదే ఇంత సుదీర్ఘకాలం సమర్థవంతంగా పనిచేయడం సాధ్యం కాదన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ మురళీధర్, ఏఓ జ్యోతిర్మయి, జిల్లా పోలీస్ ప్రెసిడెంట్ అశోక్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి