
పారిపోయిన విద్యార్థి అప్పగింత
కుల్కచర్ల: చదవడం ఇష్టం లేక పాఠశాల నుంచి పారిపోయిన విద్యార్థిని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కుల్కచర్ల గ్రామానికి చెందిన గుడిసె అఖిల్ ముజాహిద్‌పూర్ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతూ స్థానికంగా బీసీ వసతిగృహంలో ఉంటున్నాడు. బుధవారం అతడు పాఠశాల సమయంలో బయటకు వచ్చి కుల్కచర్లకు వచ్చి బస్సులో షాద్‌నగర్ వెళ్లాడు. అక్కడ పోలీసులు బాలుడిని గమనించి వివరాలు అడిగారు. పొంతనలేని సమాధానం చెప్పడంతో అతడి చిరునామా తెలుసుకుని స్థానికుల ద్వారా కుల్కచర్ల పోలీస్‌స్టేషన్‌కు పంపించారు. గురువారం ఉదయం ఎంఈఓ హబీబ్ అహ్మద్ సమక్షంలో అఖిల్‌ను కుటుంబీకులకు అప్పజెప్పారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సతీష్, వసతిగృహ ప్రత్యేకాధికారి విజయ్‌కుమార్, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.