
నేడు వికారాబాద్‌కు మంత్రి తుమ్మల
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని శివారెడ్డిపేట సమీపంలో మంగళశారంచేపట్టనున్న ఆయిల్ పాం ప్లాంటేషన్ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్‌తో కలిసి మంత్రి పాల్గొంటారని పేర్కొన్నారు.
2న కొడంగల్‌కు
మంద కృష్ణ
కొడంగల్: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆగస్టు 2న కొడంగల్‌కు రానున్నారని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కొడిగంటి మల్లికార్జున్ తెలిపారు. ఈ మేరకు సోమవారం పట్టణంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. దివ్యాంగులకు రూ.6 వేలు, వృద్ధులు, వితంతువులకు రూ.4 వేల పెన్షన్ ఇవ్వాలనే డిమాండ్‌తో సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగేశ్వర్‌రావు, అందె రాంబాబు, భీంరాజ్, మున్నంగి నాగరాజు, ప్రశాంత్, ఆనంద్, మల్కప్ప, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
సీసీ కెమెరాలు తప్పనిసరి
ఎస్పీ నారాయణరెడ్డి
మర్పల్లి: మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్లు, దుకాణాల వద్ద విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయన స్థానిక వ్యాపారులు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేరాలు, దోపిడీలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో సహకరిస్తాయని చెప్పారు. ప్రతిఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు.మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ రవూఫ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

నేడు వికారాబాద్‌కు మంత్రి తుమ్మల