
పాదయాత్రకు తరలిరండి
పరిగి: కాంగ్రెస్ భావజాల్లాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తున్నారని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 31న రంగాపూర్ నుంచి పరిగి పట్టణ కేంద్రం వరకు సాయంత్రం 5 గంటలకు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఉంటుందన్నారు. శుక్రవారం తుంకుల్‌గడ్డలో శ్రమదాన కార్యక్రమం, ఉమ్మడి జిల్లా పార్టీ ముఖ్య నాయకులతో సమీక్ష ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ మేర మేలు చేకూరుస్తున్నాయని తెలుసుకువడమే పాదయాత్ర ఉద్దేశమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు దిశానిర్దేశంపై చర్చిస్తామన్నారు. బీసీలకు ఇచ్చిన హమీ ప్రకారం 42శాతం రిజర్వేషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తే కేంద్రం అడ్డుపడుతోందన్నారు. కేంద్రంపై కొట్లాడేందుకు ఆగస్టు 5,6,7వ తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్‌ల కోసం కొట్లాడుతామన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రేపు రంగాపూర్ నుంచి ప్రారంభం
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి