
త్వరగా పూర్తి చేయండి
కలెక్టర్ ప్రతీక్ జైన్
● ఆస్పత్రిలో మరమ్మతు పనుల పరిశీలన
అనంతగిరి: ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కొనసాగుతున్న మరమ్మతు పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. వికారాబాద్‌లోని ఆస్పత్రిని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులు, వాష్‌రూంలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆస్పత్రిలో అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెయింటింగ్, మరమ్మతు పనులను పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్ ఈఈ ఉమేశ్, సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి తదితరులు ఉన్నారు.