సీపీఎస్‌ రద్దుకు ఉద్యమిస్తాం | - | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌ రద్దుకు ఉద్యమిస్తాం

Jul 29 2025 9:21 AM | Updated on Jul 29 2025 9:21 AM

సీపీఎస్‌ రద్దుకు ఉద్యమిస్తాం

సీపీఎస్‌ రద్దుకు ఉద్యమిస్తాం

పీఆర్‌టీయూ టీఎస్‌ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌

మోమిన్‌పేట: ఉపాధ్యాయులు, ఉద్యోగులకు గుదిబండగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎస్‌) రద్దుకు ఉద్యమం చేస్తామని పీఆర్‌టీయూ టీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కడియాల చంద్రశేఖర్‌ అన్నారు. మండల పరిధిలోని పలు పాఠశాల్లో సోమవారం సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పాత పెన్షన్‌ పద్ధతిని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఈమేరకు సెప్టెంబర్‌ 1న ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు అరుణ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి దండు రమేశ్‌, గౌరవ అధ్యక్షుడు ప్రభాకర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement