శ్రీకాళహసి ్త మున్సిపల్‌ చైర్మన్‌ బరిలో స్వతంత్ర అభ్యర్థిగా పాండురంగయ్య పోటీ నుంచి తప్పుకోవాలని మొదటి నుంచి కూటమి నేతల ఒత్తిడి | - | Sakshi
Sakshi News home page

శ్రీకాళహసి ్త మున్సిపల్‌ చైర్మన్‌ బరిలో స్వతంత్ర అభ్యర్థిగా పాండురంగయ్య పోటీ నుంచి తప్పుకోవాలని మొదటి నుంచి కూటమి నేతల ఒత్తిడి

Nov 30 2026 12:17 AM | Updated on Nov 30 2026 12:17 AM

● పురపోరులో దొంగ ఓట్లను అడ్డుకున్న వైనం ● కౌంటింగ్‌ రోజూ కుట్రలను అడ్డుకుంటాడనే అనుమానాలు ● నిర్మానుష్య ప్రాంతంలో పాండురంగయ్యపై దూసుకెళ్లిన గుర్తు తెలియని కారు ● ఆయన ద్విచక్ర వాహనాన్ని పది మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన వైనం ● ఇది హత్యాయత్నమా.. ప్రమాదమా? ● శ్రీకాళహస్తిలో రాజకీయ కలకలం

● పురపోరులో దొంగ ఓట్లను అడ్డుకున్న వైనం ● కౌంటింగ్‌ రోజూ కుట్రలను అడ్డుకుంటాడనే అనుమానాలు ● నిర్మానుష్య ప్రాంతంలో పాండురంగయ్యపై దూసుకెళ్లిన గుర్తు తెలియని కారు ● ఆయన ద్విచక్ర వాహనాన్ని పది మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన వైనం ● ఇది హత్యాయత్నమా.. ప్రమాదమా? ● శ్రీకాళహస్తిలో రాజకీయ కలకలం

శ్రీకాళహస్తి:శ్రీకాళహస్తిలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసినా పట్టణంలో రాజకీయ వేడి చల్లారడం లేదు. ఎన్నికల అనంతరం చైర్మన్‌ అభ్యర్థి దాస్‌పై దాడి.. పోలీస్‌స్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి మరువకముందే.. తాజాగా మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పాండురంగ య్య శనివారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడం పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. రాజీవ్‌నగర్‌ సమీపంలోని దేవుని బాటలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పాండురంగయ్యను గుర్తు తెలియని కారు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇది సాధారణ రోడ్డు ప్రమాదమా? లేక రాజకీయ కక్షతో జరిగిన ఘటనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విషమంగా పరిస్థితి.. రుయాకు తరలింపు

ముసిలిపేడు సమీపంలోని బత్తయ్య కాలనీ వద్ద కూలి పనివారి కోసం ఉదయం వెళ్లి తిరిగి వస్తుండగా నిర్మానుష్య ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పాండురంగయ్య శరీరమంతా గాయాలే. ఎడమ చేయి విరిగిపోయింది. కుడి చేయి, రెండు కాళ్లకు, తల కుడిభాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాండురంగయ్య కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తర్వాత తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకెళ్లారు.

పది మీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లు

ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తే పలు అనుమానాలకు తావిస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ద్విచక్ర వాహనాన్ని పది మీటర్ల దూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఆ ప్రాంతంలో రక్తపు మరకలు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం, చుట్టుపక్కల సీసీ కెమెరాలు అందుబాటులో లేకపోవడంతో ఢీకొట్టిన వాహనం వివరాలు తెలియరాలేదు.

తెల్ల కారు కదలికలపై ఆరా

పాండు చెప్పిన వివరాల మేరకు తెల్లని కారు గుద్దిందని తెలుస్తోంది. ప్రమాదానికి కొంత సమయం ముందు దేవుని బాట మీదుగా వేగంగా వెళ్లిన తెల్ల కారు కొన్ని ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైంది. ఆ కారు ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఆ సమయంలో చేరుకునే అవకాశం ఉందా? ప్రమాదానికి ఆ వాహనానికి ఏమైనా సంబంధం ఉందా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. సీసీ కెమెరాలను సమగ్రంగా పరిశీలిస్తే కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన ఎలా జరిగి ఉంటుందో ఇంకా పోలీసులు నిర్ధారణకు రాలేదని సమాచారం. పోలీసుల విచారణతోనే అసలు నిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement