ఎస్వీయూలో కృత్రిమ మేధస్సుపై శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ఎస్వీయూలో కృత్రిమ మేధస్సుపై శిక్షణ

Nov 30 2026 12:17 AM | Updated on Nov 30 2026 12:17 AM

తిరుపతి సిటీ: ఎస్వీయూలో కృత్రిమ మేధస్సుపై నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్త కార్యశాల జరుగనున్నట్లు వీసీ ప్రొఫెసర్‌ టాటా నరసింగరావు తెలిపారు. ఆదివారం వీసీ చాంబర్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర మానవ వనరుల శాఖ, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, జైపూర్‌ మాలవీయ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, రూసా సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న నెలరోజుల శిక్షణా తరగతులకు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహణా బాధ్యతలు తీసుకుందని చెప్పారు. శిక్షణా కార్యక్రమం ఎస్వీయూలోని శ్రీనివాస ఆడిటోరియంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుందని తెలిపారు. నెలరోజుల శిక్షణ తరగతులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 3 వేల మంది అధ్యాపకులు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకుంటున్నారని తెలిపారు. ఇందులో చాట్‌ జీపీటీ, క్లౌడ్‌, జెమనై, ఫర్‌ఫ్లెక్సిటీ వంటి కృత్రిమ మేధస్సు యాప్‌లపై అవగాహన కలిగిస్తారని తెలిపారు. ఆసక్తిగలవారు http://online.mnit.ac.in/eict/clogin లింక్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో రెక్టార్‌ ఆచార్య చండ్రాయుడు, రిజిస్ట్రార్‌ ఆచార్య భూపతి నాయుడు, రూసా కోఆర్డినేటర్‌ ఆచార్య సుచరిత, వంశీ రాయల్‌, కంప్యూటర్‌ విభాగం ఆచార్యులు అంజన్‌ బాబు, హుమేరా ఖానమ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement