తిరుపతి అర్బన్: తయ న్యాయమైన సమస్యల పరిష్కారానికి గత నెల 27న జిల్లాలోని స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగులు చలో విజయవాడకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం వారిపై కక్ష సాధింపులకు దిగుతోంది. ఉద్యమ నేతలకు(సచివాలయ ఉద్యోగులకు) శనివారం షోకాజ్ నోటీసులు జారీ సింది. ఇందులో స్వర్ణ గ్రామ, వార్డు పరిధిలో పనిచేస్తున్న తోటకూర కోటేశ్వరరావు, అక్బర్ అలీ, చంద్రకుమార్, నరేంద్రకు జిల్లా అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సమస్యలకు పరిష్కారం చూపించే వరకు పోరాటాలు చేస్తూనే ఉంటామని సచివాలయ ఉద్యోగ సంఘ నేతలు స్పష్టం చేస్తున్నారు.


