– 8లో
– 8లో
ఏడు టన్నుల రాగి వైరు చోరీ చేసేందుకు యత్నించిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు.
బీసీలను మోసం చేయడమే
చంద్రబాబు నాయుడు మరోసారి మోసపూరిత తంతుతో బీసీలన మోసం చేయడమే. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబుకు బీసీల పట్ల నిజమైన ప్రేమ ఉంటే నిర్ధిష్టమైన విధానంతో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత చేయక, మరో మారు వారిని దగా చేయడం దారుణం. 34 శాతం బీసీల రిజర్వేషన్ లేకపోతే రాష్ట్రంలో 16 వేలకుపైగా ఎంపీటీసీలు, జెడ్‌పీటీసీల పదవులను బీసీలు కోల్పోయే ప్రమాదం ఉంది.
–కల్లూరు నాగరాజగౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికారప్రతినిధి
కపటి ప్రేమ బహిర్గతం
బీసీలకు కూటమి ప్రభుత్వం కల్పించిన 34 శాతం రిజర్వేషన్లు కోర్టులో తిరస్కారానికి గురయ్యాయి. వారి పట్ల కూటమికి ఉన్న కపటి ప్రేమ బహిర్గతమైంది. సమగ్రమైన నిబద్ధత లేకుండా బీసీల రిజర్వేషన్లు మాటలు, జీవోలతో మభ్యపెట్టడమే. బీసీల పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చట్టబద్ధత చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలి.
– గంధం వెంకటముని, బీసీ నేత, బీజేపీ సీనియర్ నాయకుడు


